ఆంధ్రాలో ఈరోజు
"ఆంధ్రాలో ఈరోజు" రిపోర్టర్స్ కావలెను   |   "ఆంధ్రాలో ఈరోజు" పత్రికలో ప్రకటనలు కోసం సంప్రదించండి సెల్: 7670832346   |

CNAP (కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్)

  • Thursday, December 18, 2025

ఆంధ్రాలో ఈరోజు

 

భారతదేశంలో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం CNAP (కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్) వ్యవస్థను 2026 మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. ట్రూకాలర్ లాంటి యాప్‌లకు బదులు ఆధార్ లింక్డ్ KYC డేటా ఆధారంగా కాల్ చేసేవారి నిజమైన పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మార్పు ప్రజలను మోసాల నుంచి కాపాడుతుంది.

 

కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) అనేది టెలికాం ఆపరేటర్ల KYC డేటాబేస్‌ల నుంచి రియల్‌టైమ్‌లో వెరిఫైడ్ పేరులను డిస్‌ప్లే చేసే సిస్టమ్. తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే సిమ్ కొనుగోలు సమయంలో ఆధార్‌లో రిజిస్టర్ అయిన పేరు కనిపిస్తుంది, ఫీచర్ ఫోన్‌లలో కూడా ఈ ఫీచర్ పని చేస్తుంది. ఇది స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ను సులభంగా గుర్తించేలా చేస్తుంది.

 

సైబర్ నేరగాళ్లు ‘పోలీస్ అధికారి’, ‘డిజిటల్ అరెస్ట్’ వంటి ఫేక్ పేర్లతో మోసం చేస్తున్నారు. ట్రూకాలర్‌లో పేరు మార్చుకోవడం సులభం కాబట్టి అది విఫలమవుతోంది. CNAPలో పేరు మార్చలేనందున నేరాలు 50% తగ్గుతాయని TRAI అంచనా వేసింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో ట్రయల్స్ విజయవంతమయ్యాయి.

 

2025 నవంబర్ 30 నాటికి ఎయిర్‌టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు సిస్టమ్ రెడీ చేశాయి. 2026 మార్చి నుంచి పూర్తి అమలు. యూజర్లు ప్రైవసీ ఆప్షన్‌తో పేరు డిస్‌ప్లే ఆఫ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ క్రైమ్ నివారణకు ఇది పెద్ద బూస్ట్.

వార్తను పంపించండి

మరిన్ని వార్తలు చదవండి