దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు
దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను ఏపీలో అత్యంత భారీ వర్షాలు ఆంధ్రాలో ఈరోజు - విజయవాడ తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం విశాఖకు 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 1010 కిలోమీటర్లు, బాపట్లకు 1080 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం సోమవారానికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 27న పశ్చిమ...