ఆంధ్రాలో ఈరోజు
Date of Publish : 25 October 2026, 5:48 pm Posted by : ఆంధ్రాలో ఈరోజు

ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా.. ప్రజల పక్షాన నేనే నిలబడతా.. : ఏకగ్రీవమైన కూటమి కౌన్సిలర్లకు “గురజాల ఎమ్మెల్యే యరపతినేని స్వీట్ వార్నింగ్”

ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా

 

  • ప్రజల పక్షాన నేనే నిలబడతా..

 

  • ఏకగ్రీవమైన కూటమి కౌన్సిలర్లకు “గురజాల ఎమ్మెల్యే యరపతినేని స్వీట్ వార్నింగ్”

 

 

ఆంధ్రాలో ఈరోజు – పిడుగురాళ్ళ

 

 

ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే యరపతినేని స్పష్టం చేశారు.

 

తమ వార్డుల్లో ప్రతిపక్షం లేదనే భావనతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. “ప్రశ్నించేందుకు ప్రతిపక్షం లేదని భావించి ప్రజా సమస్యలను పక్కన పెడితే.. ప్రజల తరపున తానే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. తానే ప్రశ్నిస్తా” అని స్పష్టం చేశారు.

 

కౌన్సిలర్లు తమ తమ వార్డుల ప్రజలతో మమేకమై, నిరంతరం వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని కోరారు.