పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగదీష్ ఆదహళ్లి
పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగదీష్ ఆదహళ్లి ఆంధ్రాలో ఈరోజు - నరసరావుపేట పల్నాడు జిల్లా నూతన పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా కె.జగదీష్ ఆదహళ్లి గురువారం నరసరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్లో ఆయనను పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది నూతన ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో...