ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
- వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రాలో ఈరోజు – తాడేపల్లి
రాష్ట్రంలో రాజ్యాంగం కుప్ప కూలిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని శనివారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గడచిన రెండు రోజులుగా వైసీపీ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వడం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలను ముఖ్యమంత్రి ఛిద్రం చేస్తున్నారని, కూటమి నేతలు హింసకు పాల్పడేందుకు లైసెన్సు ఇచ్చేశారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లేందుకు తమ పార్టీ ఎంపీలను కూడా అనుమతించడం లేదన్నారు.


