పెద్ద వారికీ వ్యాక్సినేషన్ అవసరమే : డాక్టర్ ధూళిపాళ్ళ భరత్ కుమార్

Date:

📰 Generate e-Paper Clip

పెద్ద వారికీ వ్యాక్సినేషన్ అవసరమే

  • డాక్టర్ ధూళిపాళ్ళ భరత్ కుమార్

 

టీకాలు చిన్న పిల్లలకు మాత్రమే పరిమితం కావని, పెద్దవారు కూడా తమ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, గతంలో తీసుకున్న టీకాలను బట్టి అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవాలని ఐఎంఏ పల్నాడు జిల్లా పిడుగురాళ్శ శాఖ అధ్యక్షులు డా. ధూళిపాళ్ళ భరత్ కుమార్ తెలిపారు.

వయస్సు పెరగడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా/COPD, కిడ్నీ లేదా లివర్ వ్యాధులు వంటి పరిస్థితుల వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు పెద్దవారిలో తీవ్రమైన అనారోగ్యం, సంక్లిష్టతలు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితికి దారి తీయవచ్చని పేర్కొన్నారు.

ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ : సీజనల్ ఫ్లూ, దాని వల్ల వచ్చే తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడుతుందని, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి సంవత్సరం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు.

 న్యూమోకాకల్ వ్యాక్సిన్ : న్యూమోకాకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనియా, మెనింజైటిస్, రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో సహాయ పడుతుందని పేర్కొన్నారు. ఇది ప్రతి సంవత్సరం తీసుకునే టీకా కాదని వయస్సు, ఆరోగ్య పరిస్థితి, గత వ్యాక్సినేషన్ ఆధారంగా షెడ్యూల్ నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు.

 Td/Tdap వ్యాక్సిన్ : పెద్ద వారిలో టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (కోరింత దగ్గు) నుంచి రక్షణకు ఉపయోగ పడుతుందని తెలిపారు. గతంలో తీసుకున్న టీకాలు, వయస్సు, ప్రత్యేక పరిస్థితులను బట్టి Td/Tdap బూస్టర్ అవసరాన్ని వైద్యునితో చర్చించాలని సూచించారు.

హెపటైటిస్-B వ్యాక్సిన్ : హెపటైటిస్-B వైరస్ వల్ల కలిగే కాలేయ ఇన్ఫెక్షన్, దీర్ఘ కాలిక కాలేయ సమస్యల నుంచి రక్షణకు ముఖ్యమైనదని తెలిపారు. ముఖ్యంగా అవసరమైన వయస్సు, రిస్క్ గ్రూపుల్లో ఉన్న వారు, ఆరోగ్య సిబ్బంది తమ వ్యాక్సినేషన్ స్థితిని వైద్యునితో సమీక్షించు కోవాలని సూచించారు.

హెర్పీస్ జోస్టర్ (షింగిల్స్) వ్యాక్సిన్ : గతంలో చికెన్‌పాక్స్‌కు కారణమైన వైరస్ శరీరంలో తిరిగి క్రియాశీలమైతే షింగిల్స్ రావచ్చని, ఇది తీవ్రమైన నొప్పితో పాటు కొందరిలో దీర్ఘ కాలిక నరాల నొప్పికి దారి తీయవచ్చని తెలిపారు. ముఖ్యంగా వయస్సు పెరిగిన వారు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారు వైద్యుని సలహాతో షింగిల్స్ వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాలని సూచించారు.

ప్రతి వ్యక్తికీ ఒకే వ్యాక్సినేషన్ షెడ్యూల్ వర్తించదని, వయస్సు, ఆరోగ్య పరిస్థితి, వృత్తిపరమైన ప్రమాదం, గతంలో తీసుకున్న టీకాలను బట్టి వైద్యుని సలహాతో అవసరమైన వ్యాక్సిన్లను నిర్ణయించుకోవాలని డా. ధూళిపాళ్ళ భరత్ కుమార్ కోరారు.

Share post:

Subscribe

Popular

More like this
Related

ఎన్నికల సంఘంపై ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్’ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సంఘంపై 'వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్' కీలక వ్యాఖ్యలు  దేశంలోని...

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌ సంచలన...

పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు ఏమైందో తెలుసా…?!

పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు ఏమైందో తెలుసా...?!   ఆంధ్రాలో ఈరోజు - పార్వతీపురం...

ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన

ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన   ...
App Icon

Install Andhralo Eeroju App

Add to home screen for faster loading and latest updates.